మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి గల్లంతైన 10 మంది రెస్క్యూ సిబ్బంది.. ఖమ్మంలో తీవ్ర విషాదం

3 hours ago 2
ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువు వద్ద మత్స్యకారులను రక్షించే క్రమంలో రెస్క్యూ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. భారీ వర్షాలతో చెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీటిలో చిక్కుకున్న జాలర్లను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది బోట్లలో వెళ్లారు. తొలుత కొందరిని రక్షించినప్పటికీ.. మరోసారి సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో రెండు బోట్లు పల్టీలు కొట్టాయి. దీంతో 10 మంది సిబ్బంది గల్లంతయ్యారు. కలెక్టర్, ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
Read Entire Article