ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల వివాదం ఎన్నికల వేళ మరోసారి సెగలు పుట్టిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కొటియా గ్రామాలకు కూడా ఏపీ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ అక్కడ ఎన్నికల నిర్వహణకు ఒడిశా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో నేరెళ్లవలసలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఏపీ ఎన్నికల సిబ్బంది, అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిని అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో నేరెళ్లవలస పోలింగ్ కేంద్రాన్ని సమీపంలోని సారిక గ్రామానికి మారుస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.