తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదలైనట్లు వచ్చిన మొబైల్ సందేశాలు రైతులను అయోమయానికి గురిచేశాయి. ఎకరానికి ఏడాదికి రూ.12 వేల చొప్పున డబ్బులు ఖాతాల్లో జమ అయినట్లు వచ్చిన ఎస్ఎంఎస్‌లు నమ్మి బ్యాంకు ఖాతాలు పరిశీలించిన రైతులకు నిరాశ ఎదురైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. సుమారు 2,73,128 మంది రైతులకు అనధికారిక సందేశాలు వెళ్లినట్లు గుర్తించిన వ్యవసాయ శాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.