తెలంగాణలో భూముల విలువను పెంచడానికి గత ఏడాది నుంచి ప్రయత్నిస్తోన్న రేవంత్ రెడ్డి సర్కారు.. ఏప్రిల్ 1 నుంచి భూముల విలువను పెంచనుందని తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భూములు, ఫ్లాట్లు, ఇండ్ల విలువను భారీగా పెంచే అవకాశం ఉంది. దీంతో దీనికి అనుగుణంగా మార్కెట్లోనూ వాటి ధరలు పెరగనున్నాయి. భూముల విలువను పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఇప్పుడు వస్తోన్న ఆదాయాన్ని మరో 40 శాతం పెంచుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.