లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తీగను లాగితే.. ఏకంగా రూ.600 కోట్ల అవినితి డొంక కదిలింది. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద రెండో ఆపరేషన్‌గా చెప్తున్నారంటే.. గురుడు ఎంతగా సంపాధించాడో అర్థమవుతోంది. గండిపేటలో ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న నికేష్ కుమార్ ఆస్తుల చిట్ట చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నాయంటే.. ఏ రేంజ్‌లో అక్రమార్జన చేశాడో తెలుస్తోంది. ఇంకా బ్యాంకు లాకర్లు, బినామీ ఆస్తుల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.