ఐఏఎస్ ఆమ్రపాలి క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. గతంలో ఆమ్రపాలిని క్యాట్ తెలంగాణ క్యాడర్‌కు కేటాయించాలని ఆదేశించగా.. ఆ నిర్ణయాన్ని డీఓపీటీ హైకోర్టులో సవాలు చేసింది. క్యాట్ ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో ఆమ్రపాలి కూడా ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు హైకోర్టు తుది తీర్పు కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.