విజయవాడ ఉత్సవ్‌లో తమిళనాడు సీఎం విజయ్ తెలుగులో ప్రసంగించారు. విజయవాడకు రావడం ఆనందంగా ఉందని, తనను ఆదరిస్తున్న తెలుగు ప్రజలకు ధన్యవాదాలని ఆయన తెలిపారు. దీంతో సభా స్థలం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలసి విజయ్ వేదికను పంచుకున్నారు. ఇలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేదికను పంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా గతంలో కూడా ఇలానే దివంగత నాయకురాలు జయలలిత తెలుగులో ప్రసంగించేవారు.