ఈనెల 26న ఇరిగేషన్ శాఖలో ఏఈఈలుగా ఎంపికైన వారికి సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదల చేసిన ఏఈఈ సెలక్షన్ లిస్టులో బిట్స్ పిలానీ, ఎన్ఐటీ, ఐఐటీ, ఐఐఐటీల్లో చదివిన వారున్నారు. సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో కోట్ల లక్షల జీతం వదులుకొని ప్రభుత్వ కొలువులు సాధించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో జాబ్ సెక్యూరిటీతో పాటుగా ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.