హైదరాబాద్‌లో పీక్ అవర్స్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కేపీహెచ్‌బీ నుంచి వేవ్‌రాక్ వరకు టీజీఎస్‌ఆర్టీసీ, ఐటీ కంపెనీల బస్సులకు ప్రత్యేక లేన్ ఏర్పాటు చేసే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, టీజీఎస్‌ఆర్టీసీ.. రోడ్డు, సిటీ ప్లానింగ్ నిపుణులతో కలిసి ట్రయల్ రన్ నిర్వహించారు. బస్సులు తక్కువ స్టాప్‌లతో వేగంగా ప్రయాణించేలా ప్రతిపాదిత మార్గాన్ని పరిశీలించారు. జేఎన్‌టీయూ-బయోడైవర్సిటీ కారిడార్‌లో ట్రాఫిక్ ప్రవాహం, రోడ్డు సామర్థ్యం, ఇతర వాహనాల రాకపోకలపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ట్రయల్ రన్ ఫలితాలు, ట్రాఫిక్‌పై ప్రభావాన్ని అంచనా వేసిన తర్వాత ప్రత్యేక బస్ లేన్‌పై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.