గుంటూరుజిల్లా తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైన్స్‌కు విద్యుత్ సరఫరా చేసే కరెంట్ తీగలు అకస్మాత్తుగా తెగిపడ్డాయి. అదీ కూడా గుంటూరు నుంచి రేపల్లె వెళ్లే ప్యాసింజర్ రైలుపై భాగంలోని విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగి ఆ ట్రైన్‌పై పడ్డాయి. దాంతో నిప్పు రవ్వలు కూడా ఎగిశాయి. అయితే ఆ విద్యుత్ తీగలు తెగి పడినా విద్యుత్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం రైల్వే అధికారులు రంగంలోకి దిగి రెండు గంటల పాటు శ్రమించి మరమ్మతులు చేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.