హైదరాబాద్‌లోని సైబరాబాద్ ఐటీ కారిడార్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వ్యక్తిగత వాహనాలకు బదులుగా ఐటీ కంపెనీల ఉద్యోగులు బస్సులు, కార్ పూలింగ్‌ను వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. ఒకే ప్రాంతం నుంచి వచ్చే ఉద్యోగులు ఒకే వాహనంలో ప్రయాణిస్తే.. రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గి, ఇంధన వ్యయం కూడా ఆదా అవుతుందని అధ్యయనంలో తేలింది. మైండ్‌స్పేస్ పార్క్‌లో పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేసి.. ట్రాఫిక్‌ను 20 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.