దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం అట్టహాసంగా ముగిసింది. ఈ మెగా వేలంలో ఫ్రాంచైజీలన్నీ కోట్లు కుమ్మరించి తమకు కావాల్సిన క్రికెటర్లను వేలంలో దక్కించుకున్నాయి. ఇక ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు క్రికెటర్లు ఐపీఎల్ ఆడనున్నారు. విశాఖపట్నానికి చెందిన నితీష్ కుమార్ రెడ్డి ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుఫున సత్తాచాటుతున్నారు. నితీష్ కుమార్ రెడ్డితో పాటుగా షేక్ రషీద్, పైలా అవినాష్, త్రిపూర్ణ విజయ్, వెంకట సత్యనారాయణ రాజు ఈసారి ఐపీఎల్ ఆడనున్నారు.