Srikakulam Tripurana Vijay Ipl Entry: ఐపీఎల్ వేలంలో సిక్కోలు కుర్రాడు త్రిపురాన విజయ్‌ను ఢిల్లి కేపిటల్స్ టీమ్ కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్న విజయ్‌ను రూ.30 లక్షలకు ఢిల్లీ టీమ్ సొంతం చేసుకుంది. విజయ్‌ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. శ్రీకాకుళం గర్వపడేలా.. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఐపీఎల్‌కు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నాడు విజయ్. తనను ఎంపిక చేసిన ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు.