Ongole Wife Son Organ Donation For Family Member: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రామారావును ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కాలేయం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కాలేయం పూర్తిగా చెడిపోగా, కిడ్నీ ఫెయిల్ కావడంతో రక్తంలో విషపదార్థాలు చేరాయి. ఆయన్ను హైదారాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిక తరలించగా.. అక్కడ డాక్టర్లు కాలేయం, కిడ్నీ మార్చాలని చెప్పారు. అయితే దీంతో ఆయన భార్య కిడ్నీ, కుమారుడు కాలేయం ఇచ్చి రామారావు ప్రాణాలను కాపాడారు.