ఒంగోలులో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న వైనం వెలుగుచూసింది. బాలాజీరావుపేటలో ఈ ఘటన జరిగింది. డాబాపైన స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్పా సెంటర్ మీద దాడి చేసిన పోలీసులు.. ఒక విటుడు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే స్పా సెంటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సీఐ తెలిపారు.