Ongole Man Abducted Stepdaughter: ఓ మహిళ భర్తకు దూరంగా ఉంటూ కుమార్తెతో వేరుగా జీవిస్తోంది. ఆ సమయంలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.. ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి వక్రబుద్ధిని బయటపెట్టాడు.. మహిళ కుమార్తెపై కన్నేశాడు. ప్రేమ పేరుతో పదో తరగతి చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆ బాలికను తీసుకొని హైదరాబాద్ వెళ్లిపోయాడు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు వారిని హైదరాబాద్‌లో గుర్తించి ఒంగోలు తీసుకొచ్చారు. అతడిపై కేసు నమోదు చేశారు.