Ongole Depot Bomb Squad Checking: ప్రకాశం జిల్లాలో ఒంగోలు బస్ డిపోలో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. ఒక్కసారి పరుగున వచ్చి డిపోలో సోదాలు చేశారు.. అనుమానాస్పదంగా ఉన్న ఓ సంచిని బయటకు తీశారు. అందులో నుంచి బాంబ్‌ను పోలి ఉన్నదానిని బయటకు తీసి వైర్లు కట్ చేశారు. ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక అవాక్కయ్యారు. ఆ తర్వాత పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. అదంతా మాక్ డ్రిల్ అని చెప్పడంతో నవ్వుకున్నారు.