ఒంగోలులో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని ఆయన కార్యాలయంలో ఉన్నప్పుడు ముసుగులు ధరించిన దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఆయన మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లా పుంగనూరులోనూ టీడీపీ నేతపై ఇటీవల దాడి జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోనూ టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన కలకలం రేపింది.