ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో వేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్చి నెలలో ఒంటిమిట్ట ఆలయంలో మహాసంప్రోక్షణ, మహాకుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు హైదరాబాద్ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన బాలమురళీకృష్ణ అనే భక్తుడు ఈ ఉత్సవాలకు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు రూ.25 లక్షలు వరకూ ఖర్చు అవుతుందని అంచనా.