హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు వ్యవహారం తెలంగాణ అసెంబ్లీలో కాక రేపింది. ఈ అంశంపై అసెంబ్లీ చర్చ పెట్టాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడ్డారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపత్యంలో సభలో గందరగోళం నెలకొంది. సభ్యులు ఒకరిపై ఒకరు పేపర్లు విసురుకున్నారు. మధ్యలో కలుగుజేసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఒక దొరపై కేసు పెడితే సభలో ఇందర రాద్ధాంతమా..? అని వ్యాఖ్యనించారు. మంత్రి కామెంట్లపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.