ఒకే పేరుతో ఆసుపత్రికి ఇద్దరు పేషెంట్లు.. మందుల చీటీ తారుమారు, వ్యక్తి మృతి..

1 month ago 8
కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడు చేసిన పొరపాటు వల్ల నిండు ప్రాణం బలైంది. ఒకే పేరుతో ఇద్దరు పేషెంట్లు ఆసుపత్రికి రావడంతో ఈ ఘటన జరిగింది. నరాల సమస్యతో వచ్చిన వృద్ధుడికి.. డయాబెటిక్ రోగికి ఇచ్చే మందులు ఇవ్వడంతో.. ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యుడు, కంపౌండర్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Entire Article