తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో వరుస సూసైడ్ ఘటనలు కలవరం రేపుతున్నాయి. కామారెడ్డిలో ఇద్దరు పోలీసుల ఆత్మహత్యల ఘటన మరువకముందే తాజాగా.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో కానిస్టేబుల్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.