సాధారణంగా ముఖ్యమంత్రులు అంటే ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా చంద్రబాబు వంటి నేతలు అయితే రోజులో 18 గంటలు పనిమీదే ధ్యాస పెడుతుంటారని అధికారులు చెప్తుంటారు. అయితే ఇంత బిజీ షెడ్యూల్లోనూ చంద్రబాబు ఓ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. సీఎం అపాయింట్‌మెంట్ కోరుతూ ట్వీట్ రాగా.. కేవలం నాలుగు గంటల్లోనే రియాక్టయ్యారు చంద్రబాబు. ట్వీట్ చేసిన వ్యక్తికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు ఇప్పుడు వైరల్ చేస్తున్నాయి.