తెలంగాణలోని ప్రైవేటు డాక్టర్లకు సీఎం రేవంత్ కీలక పిలుపునిచ్చారు. ఏడాదిలో ఒక్క నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు అందించాలని కోరారు. దీని ద్వారా పేదలకు నిపుణుల సేవలు అందించడమే కాకుండా, డాక్టర్లకు ఆత్మ సంతృప్తిని ఇస్తుందన్నారు. బంజారాహిల్స్‌లో ఏఐజీ ఆసుపత్రిని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు.