అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రైవేట్ విద్యుత్ కార్మికుడై రాజు తన విధుల్లో భాగంగా కంబదూరులోని ఓ విద్యుత్ స్తంభం ఎక్కి.. మరమ్మతులు చేసే సమయంలో కరెంట్ షాక్కు గురయ్యాడు. వెంటనే నిర్జీవంగా మారి.. కరెంట్ తీగల మధ్య చిక్కుకుపోయాడు. అక్కడే ఉన్న సిబ్బంది .. వెంటనే స్థంభంపైకి ఎక్కడి రక్షించే ప్రయత్నం చేశారు.