రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌పై మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం కేంద్రంగా... తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు వాస్తవాలు మరుగున పడుతున్నాయని, రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ కేవలం ఒక ఇన్సూరెన్స్ పథకం లాంటిదని ఆయన అన్నారు. దీనిపై సీఎం చంద్రబాబునాయుడు కావాలనే మౌనంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.