Thieves Stolen Cocks in Krishna District: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పెద్ద పండగ కోసం చిన్నాపెద్దా, ముసలీ ముతక అందరూ సిద్ధమైపోయారు. ఇక సంక్రాంతి పండుగ అంటే ఠక్కున గుర్తొచ్చేవి కోడిపందేలు. ఎప్పుడెప్పుడు తమ కోళ్లతో బరిలోకి దిగుదామా అని పందెం రాయుళ్లు ఎదురుచూస్తున్నారు. అయితే కృష్ణా జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. కోడిపందేల కోసం సిద్ధం చేస్తున్న కోడిపుంజులను కొంతమంది చోరీ చేశారు. సీసీ కెమెరాలపై దుస్తులు కప్పి మరీ 15 కోళ్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.5 లక్షల వరకూ ఉంటుందని అంచనా. దొంగతనంపై కోళ్ల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.