హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్రంగా శ్రమిస్తుంటే.. మరోవైపు స్మగ్లర్లు మాత్రం చాప కింద నీరులా తమ పని తాము కానిచ్చేస్తున్నారు. కానీ.. ఏ చిన్న క్లూ దొరికినా వదిలిపెట్టకుండా.. డేగల్లా వాలిపోయి సరుకుతో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. తాజాగా.. ఏపీ నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు మిట్టమధ్యాహ్నం పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 4 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు.