గంజాయిని వెహికల్స్‌లో తరలిస్తే పోలీసులు పట్టుకుంటున్నారని ఇతనో మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా గంజాయిని పొట్టచుట్టూ ప్యాకెట్లలాగా కట్టేసుకుని దర్జాగా బస్సులో తీసుకెళ్లాడు. అంతా బాగనే ఉంది కానీ అతని షర్ట్ నుంచి ఏదో టేప్ బయటకు వచ్చినట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని అతని షర్ట్ విప్పించడంతో అసలు బండారం బయటపడింది. దాంతో పోలీసులు తమిళనాడుకు చెందిన వ్యక్తి ని అరెస్ట్ చేశారు.