హైదరాబాద్‌లో భూగర్భజలాల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి.సెప్టెంబరు చివరి నాటికి గతేడాదితో పోలిస్తే 6.85 మీటర్ల మేర లోతుకు చేరగా.. ప్రస్తుత సగటు మట్టం 11.58 మీటర్లుగా నమోదైంది. క్యూర్ పరిధిలోని 49 మండలాల్లో సాధారణ వర్షపాతం 619 మి.మీ.లకు బదులుగా 457 మి.మీ.లే కురిసింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో నీటి సమస్య పెరుగుతోంది. జలమండలి పరిధిలో ట్యాంకర్ బుకింగ్‌లు రోజుకు 5,500కు చేరగా.. కొన్ని రోజుల్లో 6,500కు పెరుగుతాయని అంచనా. వర్షపు నీటి సంరక్షణ, నీటి పొదుపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.