ఖమ్మం జిల్లా ధంసలాపురం రెవెన్యూ పరిధిలో కొత్తగూడెం, అల్లీపురం గ్రామాల మధ్య టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 20.04 ఎకరాల భూమిని కేటాయించగా.. టీటీడీ రూ.89 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 12న వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం శిలాన్యాస పూజలు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్ హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లో టీటీడీ ఆలయాలు ఉన్నాయి. శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతోంది.