పెళ్లి పేరుతో మోసం చేశాడని మహిళ ఆరోపణ.. పోలీసు అధికారిపై కేసు నమోదు

1 hour ago 1
హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బాలస్వామిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. 2017 నుంచి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం కొనసాగించారని, 2024లో ఆయనకు భార్యాపిల్లలు ఉన్న విషయం తెలిసిందని ఆరోపించింది. 2025 జనవరి నుంచి తనను దూరం పెట్టడంతో మానసికంగా కుంగిపోయి చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా సైదాబాద్‌ పోలీసులు క్రైమ్‌ నంబర్‌ 349/2026 కింద బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 69, 81, 351(2), 352 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article