మెదక్ జిల్లాలో భూసేకరణ నోటిఫికేషన్లు రద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

1 hour ago 1
మెదక్ జిల్లా తెల్లాపూర్‌లో 92.39 ఎకరాల భూసేకరణ కోసం 2006లో జారీ చేసిన నోటిఫికేషన్‌, 2007 డిక్లరేషన్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టౌన్‌షిప్‌ ఏర్పాటు, భవిష్యత్‌ ప్రాజెక్టుల అభివృద్ధి అంటూ భూసేకరణ ఉద్దేశాన్ని స్పష్టంగా పేర్కొనలేదని వ్యాఖ్యానించింది. భూసేకరణ చట్టంలోని సెక్షన్‌ 5ఎ కింద భూయజమానుల అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించలేదని పేర్కొంది. సమాన పరిస్థితుల్లో ఉన్న భూయజమానుల విషయంలో భిన్న నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది. చట్ట నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వం అవసరమైతే తిరిగి భూసేకరణ చేపట్టవచ్చని తీర్పు వెలువరించింది.
Read Entire Article