Revanth Reddy on Old City: ఓల్డ్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఆరాంఘర్- జూపార్క్ మధ్య నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. కీలక హామీలు ఇచ్చారు. ఓల్డ్ సిటీ కాదని.. హైదరాబాద్ ఒరిజినల్ సిటీ అని చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి.. నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ఓల్డ్ సిటీలో కేబుల్ బ్రిడ్జ్ నిర్మించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఐటీ టవర్స్ కూడా నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.