ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశమే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా అలా చేస్తే కోర్టుల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. రెగ్యులరైజ్ చేయాలని పట్టుబడితే సమస్య పెరుగుతుందే తప్ప, పరిష్కారం కాదని అన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ఉద్యోగులు సహకరించాలని... వారి సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు.