రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతీ నెల 1వ తేదీనే వారి అకౌంట్లలో జీతాలు జమ చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం.. ఈ నెల నుంచే అమలు చేస్తూ.. వారి ఖాతాల్లో జీతాలు జమ చేశారు. ఇందుకోసం ప్రతీ నెల 25వ తేదీ లోగా బిల్లులు సమర్పించి.. నెలాఖరులోగా ఆడిట్ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.