రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయగా.. చెట్ల నరికివేతను వెంటనే ఆపేయ్యాలంటూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 400 ఎకరాల భూముల వ్యవహారంపై ముగ్గురు మంత్రులతో ప్రత్యేక కమిటీ వేసింది ప్రభుత్వం.