కంచ గచ్చిబౌలి భూములపై విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఈ భూములపై వట ఫౌండేషన్, హెచ్సీయూ విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. దీనిపై ఏప్రిల్ 2న వాదనలు జరిగాయి. ధర్మాసనం వాదనలు విన్న తర్వాత ఒక్క రోజు పనులు ఆపాలను ఆదేశిస్తూ నేటికి విచారణను వాయిదా వేసింది. ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు అడ్వకేట్ జనరల్ గడువు కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది.