Jagtial Woman: ఫ్రీ బస్సు పథకం పుణ్యమా అని.. గతంలో నీళ్ల ట్యాంకర్ల దగ్గర మహిళలు సిగలు పట్టుకుని కొట్లాడుకునే దృశ్యాలు మళ్లీ చూసే అదృష్టం దొరికింది. అయితే.. అప్పడు నీళ్ల కోసం ఆడవాళ్లు కొట్టుకునేవారు. కానీ ఇప్పుడు సీట్లు కోసం కొట్టుకుంటున్నారు. అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టూ సేమ్. అయితే.. ఈ మధ్య బస్సుల్లో గొడవలు కొంతమేర తగ్గాయనుకుంటే.. మరో లొల్లి జరిగింది. కండక్టర్ సీటులో కూర్చున్న ఓ మహిళ చేసిన రచ్చకు.. డ్రైవర్‌కు చిరాకొచ్చి బస్సు మధ్యలోనే ఆపేసి.. పోలీసులకు ఫోన్ చేశాడు.