హైదరాబాద్ మలక్‌పేట జమునా టవర్స్‌లో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. అనుమానంతో ఆమెను చంపేసిన భర్త.. గుండెపోటుతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. విషయం బయటపడితే జైలుకెళ్లాల్సి వస్తుందని భయపడి మృతదేహాన్ని దహనం చేసి బయటపడాలని పథకం వేశాడు. బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమివ్వటంతో అసలు బండారం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు.