ప్రసిద్ధిగాంచిన కడపలోని పెద్ద దర్గాలో సినీ నటి మీనాక్షి చౌదరి ప్రార్థనలు నిర్వహించారు. తొలుత ఆమెకు దర్గా నిర్వాహకులు ముస్లిం సంప్రదాయాలతో స్వాగతం పలికి దర్గా విశిష్టతను వివరించారు. పెద్దదర్గాను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ‘లక్కీభాస్కర్’ సినిమా విజయవంతం కావడం సంతోషంగా ఉందని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో కూడా నటించానని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు నటించనున్నానని వివరించారు. దర్గాను దర్శించుకోవాలన్న ఆశ నేటికీ వేరిందని, ఈ దర్శనం తనకెంతో సంతృప్తినిస్తోందని తెలిపారు.