ఏకాంతంగా గడిపేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లిన జంటకు కరెంట్ షాక్ కొట్టిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో చోటుచేసుకుంది. ఏకాంతంగా ఉండేందుకు యువతీయువకులు బత్తలపల్లి తండా సమీపంలోని పొలాల్లోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి గాయపడ్డారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. యువతి స్వల్పంగా గాయపడ్డారు. వీరి కేకలు విన్న గొర్రెల కాపర్లు పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించారు.