నామినేషన్ సందర్భంగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి, దర్శిలోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ కేంద్రం దగ్గర వైసీపీ నాయకులు నిరసనకు దిగారు. ఆ కేంద్రం లోపలున్న టీడీపీ నాయకులను బయటకు పంపించాలంటూ వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉందని, గుంపులుగా ఉండొద్దంటూ పోలీసులు హెచ్చరించారు. అలాగే దర్శిలోనూ తీవ్ర ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది. నామినేషన్లు వేసేందుకు బయలుదేరిన తమ అభ్యర్థులను అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు.