ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ వద్దకు వెళ్తాం. డాక్టర్ పరీక్షించి అందుకు అవసరమైన వైద్యం చేస్తారు. కంటి సమస్య ఉంటే కంటికి పంటి సమస్య ఉంటే పంటికి అవసరమైన చికిత్సలు చేస్తారు. అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం ఓ డాక్టర్ కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వెళితే.. ఏకంగా కిడ్నీనే తొలగించాడు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా.. రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని డాక్టర్‌ను కమిషన్ ఆదేశించింది.