2023 మార్చిలో కర్నూలులో జరిగిన జంట హత్యల కేసు అప్పట్లో సంచలనంగా మారింది. పెళ్లయిన 14 రోజులకే భార్య, అతని తల్లిని భర్త కుటుంబం కలిసి హత్య చేసింది. ఈ కేసులో కర్నూలు జిల్లా సెషన్స్ కోర్టు పెళ్లి కొడుకు, అతని తండ్రికి మరణశిక్ష.. తల్లికి యావజ్జీవ శిక్ష విధించింది. ఈ కేసు హైకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రీకొడుకులకు విధించిన మరణశిక్షను రద్దు చేయడమే కాకుండా.. తల్లిని నిర్దోషిగా విడుదల చేస్తూ ధర్మాసనం తీర్పిచ్చింది.