కర్నూలు జిల్లాలో విషాదం.. గ్రౌండ్‌లోని పిల్లలపై పడిన పిడుగు..

1 year ago 25
కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతున్న పిల్లలపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని కాత్రికిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆదోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పిడుగులతో కూడిన వర్షం పడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకపోవటం మంచిదని సూచిస్తున్నారు.
Read Entire Article