రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ విజేతగా నిలవటంతో పలుచోట్ల ఆర్సీబీ అభిమానులు రెచ్చిపోయారు. ఆదివారం రోజు జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ విజయం సాధించిన అనంతరం కర్నూలులోని రాజ్ విహార్ సర్కిల్‌లో ఆర్సీబీ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. సంబరాల పేరుతో మూడు ప్రైవేటు బస్సుల అద్దాలను కొంతమంది ఆర్సీబీ అభిమానులు ధ్వంసం చేశారు. రోడ్డుపై బారికేడ్లను కిందపడేశారు. ఈ నేపథ్యంలో ఈ ఆకతాయిలను సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన కర్నూలు పోలీసులు.. మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకునిసోమవారం రోజున పోలీసు స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిరోడ్డుపై నడిపించారు.