కర్నూలులో ఉగ్ర కలకలం రేగింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఓ వ్యక్తిని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు శివారు గొందిపర్లలో పరిశ్రమలో పనిచేసే నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని ఐబీ అధికారులు అదుపులోకి తీసుకుని.. హైదరాబాద్ తరలించారు. నూర్ మహమ్మద్ సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన వాడిగా తెలిసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.