రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగింపు ఉత్తర్వులపై స్టే

1 hour ago 1
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌ భూముల వ్యవహారంలో హైడ్రా కమిషనర్‌ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించి మరో అధికారిని నియమించాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను నవంబర్‌ 3కి వాయిదా వేసింది. అప్పటి వరకు రంగనాథ్‌ హైడ్రా కమిషనర్‌గా కొనసాగనున్నారు.
Read Entire Article