తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య కలవరపెడుతోంది. దేశంలో తెలంగాణలోనే ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గణాంకాలు చెప్తున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులతో పాటుగా గవర్నమెంట్ ఆస్పత్రులలోనూ ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం, మరోవైపు ఆస్పత్రులలో డెలివరీల విషయంలో తెలంగాణలో రాష్ట్రం జాతీయ సగటు కంటే ముందుంది.